చెరువులో దూకబోయిన మహిళను కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

చెరువులో దూకబోయిన మహిళను కాపాడిన పోలీసులు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

చెరువులో దూకబోయిన మహిళను కాపాడిన పోలీసులు యువకుడి అదృశ్యం

ఇబ్రహీంపట్నం రూరల్‌: భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వివాహిత శనివారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వివాహిత శ్రావణి ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటుంది. కొంత కాలంగా భర్తతో విభేదాల కారణంగా మానసికంగా ఆందోళనకు గురైన ఆమె శనివారం స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అంతలోనే స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో చెరువు సమీపంలో పరిశీలించారు. వెంటనే ఆమెను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులను సీఐ మహేందర్‌రెడ్డి అభినందించారు. పోలీసులు మానవత్వం చాటుకోవడంతో పట్నం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

యాచారం: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. యాచారం అనుబంధ గ్రామమైన గాండ్లగూడెంకు చెందిన గంగల శివకుమార్‌ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 24 గంటల గడిచిన శివకుమార్‌ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రదేశాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం తండ్రి అబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement