గంజాయి విక్రేతకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతకు రిమాండ్‌

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

గంజాయి విక్రేతకు రిమాండ్‌

షాద్‌నగర్‌రూరల్‌: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన శనివారం ఫరూఖ్‌నగర్‌మండల పరిధిలోని ఎలికట్ట చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీతారాం తెలిపిన ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం, పూర్ణియా జిల్లా కేంద్రానికి చెందిన చోటుకుమార్‌ రెండు నెలల క్రితం షాద్‌నగర్‌ ప్రాంతానికి వలస వచ్చాడు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని ఎలికట్టలో నివాసం ఉంటూ సమీపంలోని పరిశ్రమలలో కూలీ పని చేస్తున్నాడు. ఎలికట్టలో నివసిస్తున్న బీహార్‌ ప్రాంతానికి చెందిన నీరజ్‌కుమార్‌ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసిన చోటుకుమార్‌ పరిసర ప్రాంతాల్లోని కూలీలకు, వ్యసనపరులకు విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఎలికట్ట చౌరస్తాలో ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌ పోలీసు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా చోటుకుమార్‌ పారిపోయేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పరిశీలించగా నీలి కలర్‌ ప్లాస్టిక్‌ కవర్‌లో దాదాపు కిలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా గంజాయిని విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement