ఎకోటౌన్‌ ఏర్పాటు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎకోటౌన్‌ ఏర్పాటు చేయొద్దు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

షాద్‌నగర్‌రూరల్‌: సిద్దాపూర్‌లో ఎకోటౌన్‌ను ఏర్పాటు చేయొద్దని కోరుతూ ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్‌ శనివారం టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలజగ్గారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దాపూర్‌ ప్రజల మనోభావాలకు భిన్నంగా డంప్‌యార్డును ఏర్పాటు చేయవద్దని కోరారు. గతంలో ఈ భూములు ఇండస్ట్రియల్‌ పార్కుకు ఏర్పాటుకు కేటాయించామని చెప్పారని.. అదే ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలను కల్పించాలన్నారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని కోరారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

Advertisement
 
Advertisement
Advertisement