తుర్కయంజాల్: సమీకృత మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతానికి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి కొహెడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. జూన్ 3వ తేదీన కొహెడ సర్వేనంబర్ 167/1లో ఈ మార్కెట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సభ విజయవంతం చేయాలని ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సీహెచ్.భాస్కర్ చారి, మార్కెటింగ్ శాఖ సెక్రటరీ శ్రీనివాస్, సభ్యులు రఘుపతి రెడ్డి, అంజయ్య, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, నర్సింహ, బండి మధుసూధన్ రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


