ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

ఎవరికో?

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
అమాత్యయోగం

వికారాబాద్‌: మంత్రివర్గ విస్తరణ జూన్‌ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్యనేతలు హస్తిన బాట పట్టారు. ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. రెండు రోజులుగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అక్కడే మకాం వేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరూ మంత్రి పదవి ఆశిస్తూ వచ్చారు. మొదట ప్రసాద్‌కుమార్‌ పేరు ఎక్కువగా వినిపించినా అనూహ్య రీతిలో స్పీకర్‌ పదవిని కట్టబెట్టారు. అప్పట్లో ఆయన అయిష్టంగానే బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఇక సీనియర్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఆర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డికి పూర్తి నిరాశే మిగిలింది. మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో టీఆర్‌ఆర్‌ ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతలను కలిశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఇదే బాటలో నడిచారు. వీరు అనేక సార్లు హస్తినలో పర్యటించారు. తాజాగా స్పీకర్‌ సైతం అక్కడే ఉండటంతో ఆయనను సభాపతి నుంచి తప్పించి, పోర్టుపోలియో ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే హస్తినకు పిలుపు వచ్చినట్లు ఆ పార్టీ ముఖ్యులు చర్చించుకుంటున్నారు. స్పీకర్‌ పదవి కారణంగా తాను పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన లేకపోతున్నానని ప్రసాద్‌కుమార్‌ తన సన్నిహితులు వద్ద అంటున్నట్లు సమాచారం.

మంత్రి పదవికే మొగ్గు

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికార పగ్గాలు చేపట్టింది. పార్టీ సీనియర్‌ నేత కావడంతో ప్రసాద్‌కుమార్‌కు కూడా కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. మొదటి విడత విస్తరణలో మంత్రి పదవి ఇస్తారనే చర్చ జరిగినా అవకాశం దక్కలేదు. ప్రస్తుత విస్తరణలోనైనా తనకు చాన్స్‌ వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం

రేసులో టీఆర్‌ఆర్‌

రెండు దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓటమిపాలయ్యారు. జిల్లాలో పలువురు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ వీడినా తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వికారాబాద్‌ కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవి కోసం తన వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది.

రామ్మోహన్‌రెడ్డి

హస్తిన బాటలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు

రెండు రోజులుగా ఢిల్లీలోనే స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

ఇప్పటికే వెళ్లివచ్చినరామ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement