గంటన్నర ఆలస్యంగా.. సీయూఈటీ పరీక్ష గంటన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన ఘటన శేరిగూడలో చోటు చేసుకుంది.
● మంత్రి సీతక్క
● కలెక్టరేట్‌లో ఘనంగా మహిళా వారోత్సవాలు
ఇబ్రహీంపట్నం రూరల్: జీవితాలను మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా వార్సోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క అంగన్వాడీ చిన్నారులకు యునిఫాంలు, విద్యారంబ సర్టిఫికెట్‌లు అందజేశారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో బాలల మాక్ పార్లమెంట్–స్నేహ కౌమార బాలికలతో బాలల హక్కుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిశోర బాలికల సాధికారత, విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలను గుర్తించి వారికి సరైన దిశానిర్ధేశం చేయడం ద్వారా భవిష్యత్‌లో వారు ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు. నెల్సన్ మండేలా చెప్పినట్లు విద్యే ఆయుధమన్నారు. పెద్దలపై గౌరవం, సమాజంపై బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం, ఇంటి పనుల్లో భాగస్వాములు కావడం, శ్రమకు విలువ ఇవ్వడం తదితర అంశాలు వ్యక్తిత్వ వికాసానికి అవసరమన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. స్నేహ కార్యక్రమంలో భాగస్వాములైన వారికి సైకిల్ శిక్షణ, నాయకత్వ వికాసం, వ్యక్తిత్వాభివృద్ధి , ఆరోగ్యం, విద్య తదితర అంశాల్లో శిక్షణలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అనితారామచంద్రన్, సెర్ప్ సీఈ ఓ దివ్య దేవరాజన్, మహిళా,శిశు సంక్షేమ శాఖ డైకెక్టర్ శృతి ఓజా, అదనపు కలెక్టర్ కిరణ్మయి, మహిళా కమిషన్ మెంబర్ సదాలక్ష్మి, పీడీ డీఆర్డీఏ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, మెప్మా పీడీ వెంకట నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .


