బాధితులకు న్యాయం చేయడమే విధి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేయడమే విధి

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి

మహేశ్వరం ఠాణా ఆకస్మిక తనిఖీ

మహేశ్వరం: పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఠాణాకు న్యాయం కోసం బాధితులతో మర్యాదగా మెదులుతూ వారి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రాథమిక విధి అన్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలు స్టేషన్‌ రికార్డులను పరిశీలించారు. పీఎస్‌ పరిధిలో లా అండ్‌ ఆర్డర్‌, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి ఆరా తీసారు. పోలీసు అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు ప్రసాద్‌, రాఘవేందర్‌, ధనుంజయ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement