శంకర్‌పల్లి: మాదకద్రవ్యాలు వాడితే చట్టపరమైన చర్యలుంటాయని మోకిల ఎస్‌ఐ సాయికృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారుల దుకాణాల్లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల మాదకద్రవ్యాలను యువత పెద్ద మొత్తంలో ఉపయోగిస్తుందని, దీంతో తమ ఆరోగ్యంతో పాటు జీవితం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. మాదకద్రవ్యాలు కొనే, అమ్మేవారిపై పటిష్ట నిఘా ఉంటుందని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.


