ఇక్కడందరూ మనల్ని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.. పదా అటువైపు వెళ్లిపోదాం
అరవకురా కన్నా..
నీకు నేనున్నా..
నీకేం భయం లేదు.. జాగ్రత్తగా రోడ్డు దాటిస్తా..
వామ్మో ఎన్ని పేలో..
నేను తీసేస్తాలే
ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల గొడవల్లో రక్త బంధాలను సైతం లెక్కచేయని ప్రస్తుత కాలంలో.. నోరు లేని మూగజీవాలు ఇతర ప్రాణులపై వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తల్లి కనిపించక మ్యావ్.. మ్యావ్.. అని అరుస్తూ ఓ పిల్లి పిల్ల శుక్రవారం ధారూరు బస్టాండ్‌లో తిరుగుతోంది. ఇది గమనించిన ఓ వానరం దాని వద్దకు చేరుకుని కొద్దిసేపు లాలించింది. నోటితో ఒడిసి పట్టుకుని ఠాణా ఎదురుగా ఉన్న భవనంపైకి చేరింది. తలపై పేలు చూస్తూ.. సరదగా ఆడిస్తూ, ముద్దు చేసింది. పిల్లి పిల్లను కోతి లాలించడం తామెప్పుడూ చూడలేదని స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. – ధారూరు


