షాబాద్: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని ప్రముఖ వక్త డాక్టర్ భాస్కర యోగి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ వేదాలు, పురాణాలు తెలుసుకోవాలన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మన పురాణాలు చదివి వాటిని అవలంబిస్తున్నాయన్నారు. మనం వాటిని మరువకూడదని, ఎన్ని ఆచారాలు ఉన్నా మనం ఒక్కటిగా అది మన ఐక్యతకు నిదర్శనమన్నారు. ధర్మాన్ని రక్షిస్తూ ప్రతిఒక్కరూ దేశ సేవకు ముందుండాలన్నారు. మన పిల్లలకు మన సంస్కృత్తి నేర్పించాని సూచించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని, మన విధులను మనం పాటించాలన్నారు. ఇతరులకు సేవచేయాలనే గుణం నేర్పించాలని, స్వదేశి భావన ప్రతిఒక్కరిలో పెంచాలన్నారు. కార్యక్రమంలో చిలుకూరి శివాలయం ఆలయ ప్రధాన పూజారి సురేష్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, సురేష్, ఆత్మారామ్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, భజరంగ్ దళ్ కార్యరక్తలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ వక్త డాక్టర్ భాస్కర యోగి


