లాక్రోస్‌లో విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

లాక్రోస్‌లో విద్యార్థిని ప్రతిభ

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

లాక్రోస్‌లో విద్యార్థిని ప్రతిభ హయత్‌నగర్‌: చైన్నెలో ఈనెల 23,24తేదీల్లో జరిగిన లాక్రోస్‌ సౌత్‌ జోన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆదిబట్ల సర్కిల్‌ తొర్రూర్‌ గ్రామానికి చెందిన బచ్చిగళ్ల భానుశ్రీ తెలంగాణ తరఫున పాల్గొని రాష్ట్రానికి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి గురువారం ఆమెను ఘనంగా సన్మానించారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న భానుశ్రీ అరుదైన క్రీడను ఎంచుకుని ప్రతిభ సాధించడం గర్వకారణం అని అన్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మెకం లక్ష్మమ్మ, నాయకులు సోలిపురం వెంకట్రామిరెడ్డి, పన్యాల జైపాల్‌రెడ్డి, వంగేటి గోపాల్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. డేవిడ్‌రెడ్డి సినిమా టైటిల్‌పై ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం రూరల్‌: డేవిడ్‌రెడ్డి సినిమా టైటిల్‌, ట్రైలర్‌ ద్వారా రెడ్డి సమాజాన్ని అవమానించే విధంగా ప్రచారం జరుగుతున్నందున సినిమాపై చర్యలు తీసుకోవాలని హైందవ రెడ్డి సేనా రాష్ట్ర అధ్యక్షుడు అందెం నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డేవిడ్‌రెడ్డి పేరుతో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈ టైటిల్‌ ప్రచార విధానం రెడ్డి వర్గంపై తప్పుడు అభిప్రాయాలు కలిగించే విధంగా ఉందన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పేర్లు మార్పు చేయకుండా విడుదల చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు .

మేక పిల్లపై

కొండచిలువ దాడి

కొట్టి చంపేసిన గ్రామస్తులు

తాండూరు రూరల్‌: మేక పిల్లపై కొండచిలువ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మండలంలోని సంగెంకలాన్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకలను మేపేందుకు సమీపంలోని పొలాల వద్దకు తోలుకెళ్లాడు. అక్కడ కొండచిలువ మేక పిల్లను చుట్టుముట్టి చంపేసింది. మేకల కాపరి గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వచ్చి కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు.

ఆలయాల అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

దోమ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం దోమ మండలం ఐనాపూర్‌లోని ఐదు వందల ఏళ్లనాటి రామలింగేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ రజిత భాస్కర్‌గౌడ్‌ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మినీ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేయాలని కోరగా.. త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శాంతుకుమార్‌, గ్రామస్తులు వెంకటేశ్‌, జాఫర్‌, ఉద్యమకారుడు మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement