● 1న సిద్ధాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర
● మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూరు: సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ జూన్ 1న సిద్ధాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. డంప్‌యార్డు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం పలువురు నాయకులతో కలిసి డంప్‌యార్డుకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతున్న స్థలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. గత ప్రభుత్వం హయాంలో ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పొలాలను సేకరించినట్లు తెలిపారు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికుల ఇష్టానికి వ్యతిరేకంగా డంప్‌యార్డును ప్రతిపాదించిందన్నారు. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఫ్యూచర్‌సిటీతో పాటు జేపీదర్గా, ఎంఎన్‌సీ పరిశ్రమలు, గురుకుల పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం డంప్‌యార్డు ఆలోచన విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.శ్రీనివాస్‌గౌడ్, దేవేందర్‌యాదవ్, యాదగిరి, గోపాల్‌నాయక్, బాలయ్య, రెఢ్యానాయక్, బీమయ్య తదితరులు పాల్గొన్నారు.


