బొంరాస్‌పేట: మండలంలోని ఊరెనికి తండాలో కరెంట్ షాక్‌కు గురై పాడి ఆవు మృతి చెందింది. తండాకు చెందిన హన్మ్యానాయక్ పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మన్‌ను తాకడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని సర్పంచ్ చప్లీబాయి కోరారు.
కుళ్లిపోయిన ఆలుగడ్డలతో చిప్స్ తయారీ
నాగోలు: నాగోలు మూసీ పరిసర ప్రాంతాల్లోని లక్ష్మీనర్సింహకాలనీలో చిప్స్ తయారీదారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిపోయిన ఆలుగడ్డలను ఉపయోగిస్తూ, చిప్స్ తయారు చేస్తున్నారు. వీటిని నాగోలు, ఎల్‌బీనగర్, మాన్సూరాబాద్, కొత్తపేట, సరూర్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసినా, సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు పేర్కొంటున్నారు. మూసీ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.


