చివరి గోస | - | Sakshi
Sakshi News home page

చివరి గోస

May 28 2026 8:49 AM | Updated on May 28 2026 8:49 AM

పంట విక్రయానికి రైతుల ఇబ్బందులు అప్రమత్తమైన రైతులు ఆమనగల్లు: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటికే 46వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 18 వేల బస్తాలు కొనుగోలు చేయాల్సి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు గమనించిన రైతులు అప్రమత్తతతో ధాన్యంపై టార్పాలిన్లు కప్పడంతో మంగళవారం కురిసిన వర్షానికి స్వల్పంగా ధాన్యం తడిసింది. కుప్ప అడుగుభాగం వర్షం నీటికి తడిసి నష్టం జరుగుతుందని పలువురు రైతులు వివరించారు. కాగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. రాగానే టోకెన్‌ ఇచ్చి సీరియల్‌ నెంబర్‌ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పీఏసీఎస్‌ సీఈఓ పద్మాకర్‌రెడ్డి తెలిపారు. వడ్లు తడిసాయి ధాన్యం తరలించాలి మూడు రోజుల్లేనే నగదు జమ

పంట విక్రయానికి రైతుల ఇబ్బందులు

వర్షానికి తడిసిన ధాన్యపు రాశులు

తరలింపులో ఎడతెగని జాప్యం

రోజుల తరబడి సెంటర్ల వద్ద కర్షకుల పడిగాపులు

మంగళవారం వీచిన ఈదురు గాలులకు ఆందోళన చెందా. ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు గాలికి పోకుండా కాపలాకాసా. అయినప్పటికి కొద్దిపాటి వడ్లు తడిసాయి.

– హనుమంతురెడ్డి, రైతు, చర్లపటేల్‌గూడ

సెంటర్లకు వచ్చిన ధాన్యం వెంటనే సేకరించి తరలించేలా ఏర్పాట్లు చేయాలి. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ధాన్యం తరలింపులో ఇబ్బందులు పరిష్కరించాలి.

– అంజిరెడ్డి, ఉత్తమ రైతు, శేరిగూడ

సేకరించిన ధాన్యం తరలిచేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇచ్చాం. ఇప్పటికే 12 లారీల వడ్లను మిల్లులకు తరలించాం. తరలించిన మూడురోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు.

– సత్తయ్య, ఐకేపీ సీసీ, ఇబ్రహీంపట్నం

Advertisement
 
Advertisement
Advertisement