గుప్త నిధుల కలకలం! | - | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కలకలం!

May 28 2026 8:49 AM | Updated on May 28 2026 8:49 AM

బషీరాబాద్‌: మండలంలోని జీవన్గీ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జీవన్గీ– కర్ణాటక మధ్యలోని సంగమేశ్వరాలయంలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్లు పశువుల కాపరులు గుర్తించారు. నాలుగు దశాబ్దాల క్రితం గ్రామపెద్ద ఒకరు ఈ ఆలయాన్ని నిర్మించి, కాశీనుంచి పంచలింగాలను తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఇక్కడ జనసంచారం పెద్దగా లేకపోవడంతో దుండగులు మంగళవారం రాత్రి లింగం ముందు భారీ గోతి తవ్వారు. ఈ క్రమంలో పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. గుంతను పూడ్చిన అనంతరం రాళ్లతో కప్పారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలోని 25 పురాతన ఇళ్లలోనూ మెటల్‌ డిటెక్టర్‌ సాయంతో శోధించి, తవ్వకాలు చేపట్టారు. కొంతమంది ముఠాగా ఏర్పడి నిధుల వేట సాగిస్తున్నారనే ప్రచారం ఉంది. గతేడాది బషీరాబాద్‌లోని ఓ పాడుబడిన ఇంట్లో పౌర్ణమి రోజున గుప్త నిధుల తవ్వకాలు చేపట్టడంపై కేసు నమోదైన ఘటన ఇందుకు బలం చేకూర్చింది. అయినప్పటికీ రెవెన్యూ, పురావస్తు, మైనింగ్‌ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement