మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు

May 28 2026 8:49 AM | Updated on May 28 2026 8:49 AM

షాబాద్‌: మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు చిత్తు అవుతున్నాయని షాబాద్‌ సీఐ కాంతారెడ్డి అన్నారు. బుధవారం ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు మండల పరిధిలోని అంతారం, సంకెపల్లిగూడ గ్రామాల్లో డాగ్‌స్క్వాడ్‌, ఈగల్‌ టీంలతో దుకాణాలను పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా విక్రయించిన్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వాడినట్లు గుర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమలో ఎస్‌ఐ సతీష్‌కుమార్‌, ఏఎస్‌ఐ రామ్‌లాల్‌, సర్పంచులు కుమ్మరి లావణ్య చెన్నయ్య, ప్రభాకర్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement