చెరువులో పడి మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి మహిళ దుర్మరణం

May 24 2026 11:22 AM | Updated on May 24 2026 11:22 AM

షాబాద్‌: చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన శనివారం షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కావలి సుజాత(45) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. భర్త వెంకటేష్‌, పిల్లలు బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం షాబాద్‌ పహిల్వాన్‌ చెరువులో తేలియాడుతున్న శవం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో వారొచ్చి పరిశీలించి సుజాతగా గుర్తించారు. మతిస్థిమితంతో చెరువులో పడి మృతి చెంది ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. మృతురాలి అన్న సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement