మొయినాబాద్‌రూరల్: భానుడి భగభగలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రజలే కాకుండా మూగ జీవాలు సైతం గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నాయి. శనివారం మొయినాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో ప్రజలు ఉదయం పది గంటలకే ఇళ్లలోంచి బయటకు రాలేకపోయారు. ఉక్కపోత, వేడికి మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉపశమనా నికి ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరిబొండా లు, పండ్ల రసాల విక్రయాలు అధికమయ్యాయి.


