షాబాద్: బహుజనులందరూ ఏకం కాకుంటే, తమకు న్యాయం జరగదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చందనవెళ్లి గ్రామంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఉపాధ్యక్షుడు చేవెళ్ల స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 28న షాద్‌నగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజనులు ఉద్యమం ఉధృతం చేసిన రోజునే ఏ ప్రభుత్వమైనా దిగి వస్తుందని చెప్పారు. 90 శాతం ఉన్న బహుజనులకు రిజర్వేషన్లు ఎంత మొత్తంలో ఉన్నాయో మనం గమనించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రమేష్‌యాదవ్, లాలయ్య, మల్లేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


