నలువైపులా డంపింగ్‌ యార్డులు | - | Sakshi
Sakshi News home page

నలువైపులా డంపింగ్‌ యార్డులు

May 22 2026 1:16 PM | Updated on May 22 2026 1:16 PM

నలువైపులా డంపింగ్‌ యార్డులు

సాక్షి, సిటీబ్యూరో/ఎల్‌బీనగర్‌/నాగోలు: జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎంఎంసీ కమిషనర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం నాగోలులో నిర్వహించిన ఎంఎంసీ టౌన్‌హాల్‌ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధుల డిమాండ్‌కనుగుణంగా శుక్రవారం అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును పరిశీలించనున్నట్లు తెలిపారు. డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి నగరానికి నాలుగువైపులా స్థలాల్ని గుర్తించామన్నారు. అందరూ సహకరిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీగా చేసిన ముఖ్యమంత్రికి డంపింగ్‌యార్డు సమస్య తెలుసని, ప్రస్తుతం మున్సిపల్‌శాఖ కూడా ఆయన వద్దే ఉన్నందున సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి పరిధిలో సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి తగిన నిధులివ్వాల్సిందిగా సీఎంను కోరతానన్నారు. మూడు కార్పొరేషన్ల చెత్త ఒకేచోట వేయడం అన్యాయమని మాజీ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement