గాలివాన హైరానా | - | Sakshi
Sakshi News home page

గాలివాన హైరానా

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

గాలివాన హైరానా

లేమూరులో రెండు పాడి ఆవులు మృతి

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

కందుకూరు: మండల పరిధిలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. లే మూరులో రైతు గుల్వి చిన్న మైసయ్యకు చెందిన రెండు ఆవులు పిడుగు పాటుకు మృతి చెందాయి. దీంతో తనకు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభు త్వం ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు. కందుకూరు చౌరస్తాలోని రైస్‌మిల్‌ వెనక చెట్టుపై పిడు గు పడింది. ఈదురు గాలులకు కందుకూరు లోని పలు షెడ్లు, షటర్ల రేకులు ఎగిరిపోయి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. ఈ ఘటనలో రెండు కరెంటు స్తంభాలు విరిగిపోగా, మరో రెండు నేలకొరిగాయి. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, అప్పటికే విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.

Advertisement
 
Advertisement
Advertisement