మన్‌మర్రిని సందర్శించిన విద్యార్థుల బృందం | - | Sakshi
Sakshi News home page

మన్‌మర్రిని సందర్శించిన విద్యార్థుల బృందం

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

మన్‌మర్రిని సందర్శించిన విద్యార్థుల బృందం

షాబాద్‌: మండలంలోని మన్‌మర్రి గ్రామాన్ని ఆదివారం అమెరికాకు చెందిన మినర్వా యూనివర్సిటీలో చదువుకుంటున్న 17 దేశాలకు చెందిన 25 మంది విద్యార్థుల బృందం సందర్శించింది. గ్రామంలోని వాటర్‌ ప్లాంట్‌, ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని విద్యార్థులు పరిశీలించారు. వాటర్‌ ప్లాంట్‌తో ఉపయోగాలు, గ్రామస్తులకు స్వచ్ఛమైన నీరు అందించడం తదితర విషయాలను వాటర్‌ సంస్థ ప్రతినిధులను అగిడి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై అంగన్‌వాడీ టీచర్‌ గిరిజ వివరించారు. ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నట్లు సర్పంచ్‌ లాలాపేట్‌ బందయ్య తెలిపారు. వారివెంట ఉపసర్పంచ్‌ బేగరి శంకరయ్య, వార్డు సభ్యులు నర్సింలు, వెంకటేశ్‌, జంగిలయ్య, కారోబార్‌ పరమేష్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement