మొరం తరలిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

మొరం తరలిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

యాలాల: అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, జేసీబీని రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ఆర్‌ఐ శివచరణ్‌ తెలిపిన ప్రకారం.. మండల పరధిలోని అన్నసాగర్‌లో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆర్‌ఐ ఘటన స్థలానికి చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతి లేకపోవడంతో ట్రాక్టర్లతో పాటు జేసీబీని యాలాల ఠాణాకు తరలించారు. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసినట్లు ఆర్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement