బంట్వారం: చేపలు పట్టేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లి చెరువులో ఆదివారం వెలుగు చూసింది. ఏఎస్‌ఐ వెంకటప్ప తెలిపిన ప్రకారం.. బార్వాద్ గ్రామానికి చెందిన చాకలి అంజయ్య (50) దోమ పాండు (45) వ్యవసాయదారులు. వీరిద్దరూ కలిసి ఈ నెల 10వ తేదీన సాయంత్రం చేపలు పట్టేందుకు సమీపంలోని నాగసాన్‌పల్లి చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కుటుంబీకులు వెతుకుతుండగా ఆదివారం చెరువులో మృతదేహలు నీటిలో పైకి తేలి కనిపించాయి. ఇదిలా ఉండగా ఈత వచ్చినప్పటికీ ఇద్దరూ నీటిలో మునిగి చనిపోవడం పై మృతుల కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోత్కుపల్లికి చెందిన ఇద్దరు రైతులు చెరువులో మోటార్లు పెట్టి పంట పొలాలకు నీరు పారిస్తున్నారని విద్యుదాఘాతానికి గురై మృతి చెంది ఉండవచ్చని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ధారూరు సీఐ రఘురాములు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
● ఇద్దరు రైతులు మృత్యువాత
● విద్యుదాఘాతంతో మృతి చెంది ఉంటారని కుటుంబీకుల ఫిర్యాదు
అంజయ్య (ఫైల్)
పాండు (ఫైల్)


