రాజేంద్రనగర్: బస్తీలు, కాలనీలలో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ఓ వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆటోతో పాటు ఐదు క్వింటాళ్ల రేషన్‌బియ్యన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన మాజీద్(32) ఆటో డ్రైవర్. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదర్‌గూడ పరిసర ప్రాంతాలలోని బస్తీలు, కాలనీలలో తిరుగుతూ రేషన్‌బియ్యం కొనుగోలు చేసి తన ఆటోలో పెట్టుకుంటున్నాడు. ఈ విషయంపై స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు మాజీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని పాత బస్తీకి చెందిన సాజిద్‌కు విక్రయిస్తున్నట్టు నిందితుడు వెల్లడించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.


