కడ్తాల్: ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడిన గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముద్వీన్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏదుల యాదయ్య గౌడ్ కల్లు గీస్తూ జీవనోపాఽధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
గీత కార్మికుడికి గాయాలు


