స్కూల్‌ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

Apr 12 2026 6:41 AM | Updated on Apr 12 2026 6:41 AM

షాబాద్‌: స్కూల్‌ బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్దుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని నాగర్‌గూడ వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన ప్రకారం.. తిమ్మారెడ్డిగూడ గ్రామానికి చెందిన గుత్తి లచ్చయ్య(75) శనివారం జ్వరం వచ్చిందని చేవెళ్లలోని మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని తిరుగి ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో నాగర్‌గూడ చౌరస్తా వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా నాగర్‌గూడలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలకు చెందిన బస్సు లచ్చయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన లచ్చయ్యను వెంటనే చేవెళ్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని మృతుడి మనుమడు గుత్తి శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement