బెల్టు షాప్‌ నిర్వాహకుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బెల్టు షాప్‌ నిర్వాహకుడికి రిమాండ్‌

Apr 12 2026 6:41 AM | Updated on Apr 12 2026 6:41 AM

పహాడీషరీఫ్‌: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్టుషాప్‌పై పహాడీషరీఫ్‌ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి 7.2 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి తెలిపిన ప్రకారం.. పహాడీషరీఫ్‌ గ్రామంలోని అక్బర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదుట కాలివాల నరేశ్‌(50) అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని సమాచారం అందింది. ఈ మేరకకు పోలీసులు దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 12 క్వార్టర్‌ బాటిళ్లు, 90 ఎంఎల్‌ 35 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement