జ్యోతిబాపూలే మార్గం అనుసరణీయం
ఇబ్రహీంపట్నం రూరల్: మహాత్మా జ్యోతిబాపూలే మార్గం నేటి సమాజానికి అనుసరణీయమని బీసీ సంక్షేమశాఖ అధికారి కేశురాం పేర్కొన్నారు. పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేశురాం మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యకు మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్, పీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, బీసీ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, జంగయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.


