ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ మోడల్ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని బొంగ్లూర్ మోడల్ స్కూల్ ప్రిన్స్‌పాల్ సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 సంవత్సరానికి గాను ఈనెల 19న (ఆదివారం) పరీక్ష ఉంటుందని తెలిపారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
చేవెళ్ల: తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ఈనెల 19న జరగనున్నాయని చేవెళ్ల మోడల్ స్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వినోద్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హాల్‌టికెట్ కోసం రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. పరీక్షకు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డులాంటిది వెంట తీసుకు రావాలని సూచించారు.


