అతివేగానికి ఇద్దరు యువకుల బలి | - | Sakshi
Sakshi News home page

అతివేగానికి ఇద్దరు యువకుల బలి

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

అతివేగానికి ఇద్దరు యువకుల బలి

స్తంభాన్ని బైక్‌ ఢీకొట్టడంతో ప్రమాదం

రాజేంద్రనగర్‌లో విషాదకర ఘటన

రాజేంద్రనగర్‌: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ముత్తు యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జనచైతన్య వెంచర్‌కు చెందిన సోహెల్‌ (18) ఎలక్ట్రీషియన్‌. ఇదే ప్రాంతానికి చెందిన షేక్‌ సాహిల్‌ (19) ఇంటర్‌ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శనివారం ఉదయం మొయినాబాద్‌లో ఎలక్ట్రికల్‌ పని ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. హిమాయత్‌ సాగర్‌ నుంచి అప్పా జంక్షన్‌ వైపు వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. సోహెల్‌, షేక్‌ సాహిల్‌ ఎగిరి పక్కనే ఉన్న కల్వర్టు వద్ద పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement