కాలిబూడిదైన సామగ్రి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యుత్ షార్ట్ స ర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో సామగ్రి కాలిబూడిదైంది. ఈ ఘటన మండల పరిధిలోని ఉప్పరిగూడలో శుక్రవారం చోటు చేసుకుంది. వేసవికాలం కావడంతో గ్రామానికి చెందిన షేకల్ సలీం కుటుంబ సభ్యులు ఇంటి ఆరుబటయట ఉన్న చెట్టుకింద కూర్చున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతూ వస్తోంది. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పొగలు వస్తుండడంతో వెళ్లి చూడగా టీవీతో పాటు ఇంట్లోని సామగ్రిమొత్తం కాలిబూడిదైంది. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


