రాజేంద్రనగర్ : ఓ కారు మెకానిక్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపిన మేరకు.. బుద్వేల్ రజక బస్తీ ప్రాంతానికి చెందిన డి. అశోక్ కుమార్ (56) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం అగ్రి యూనివర్సిటీ ప్రహరీ పక్కన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటల బాధ తట్టుకోలేక రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలాడు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అశోక్ కుమార్ ను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు.
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
మైలార్‌దేవ్‌పల్లి: పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన మేరకు.. సిరంగి బుచ్చయ్య స్థానికంగా నివాసముంటున్నాడు. ఈనెల 5న అర్థరాత్రి తన ఇంట్లో చోరీ జరిగిందని, గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, నగదును దొంగలించారని ఫిర్యాదు చేశాడు.


