పనులు వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పనులు వేగిరం చేయాలి

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

పనులు వేగిరం చేయాలి ఆమనగల్లు: ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణ పనులను వేగిరం చేయాలని టీజీఎంఎస్‌ఐడీసీ జిల్లా ఈఈ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం ఆయన పట్టణంలో రూ.17.50 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ఆస్పత్రి భవన నిర్మాణ పనుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌కు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. జూన్‌ 2న నాటికి ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యేలా పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఈ కోట య్య, నాయకులు మెకానిక్‌ బాబా, సైట్‌ ఇన్‌చార్జి శంకర్‌, బాలకృష్ణ, శ్రీను ఉన్నారు. మరకత శివాలయ సన్నిధిలో నవీన్‌యాదవ్‌ శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని శుక్రవారం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో మరకత లింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరకత శివుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌కి ఆలయ ప్రతిమ, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ చైర్మన్‌ దర్శన్‌, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌, అర్చకులు సాయి శివ తదితరులు పాల్గొన్నారు. మైనింగ్‌ కంపెనీపై చర్యలకు డిమాండ్‌ కడ్తాల్‌: మండల పరిధిలోని చల్లంపల్లి, బాలాజీ నగర్‌ తండాల సమీపంలోని మైనింగ్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కలెక్టరేట్‌లోని జిల్లా మైనింగ్‌ అధికారులను కలిసి వినతిపత్రం అం దజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మైనింగ్‌ పేలుళ్ల కారణంగా వచ్చే దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురై రోగాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు మైనింగ్‌ శబ్ధాలతో చిన్నారులు భయాందోళన చెందుతున్నారని.. ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికే ఇళ్లకు పగుళ్లు ఏర్పాడ్డాయని, వ్యవసాయ బోరు బావుల్లోనూ నీటి మట్టాలు తగ్గాయని ఆందోళన వెల్లిబుచ్చారు. పశువులు సైతం అనారోగ్యంపాలై మేతమేయకుండా మృత్యువాత పడుతున్నాయని అన్నారు. ఇప్పటికై నా జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులు దృష్టి సారించాలని, మైనింగ్‌ కంపెనీపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తండావాసులు జయరాం, హరి, గోపాల్‌రావు, పూర్య, దశరథం, మోత్యా, రవికుమార్‌, నాగేశ్‌, రాజేందర్‌, రమేశ్‌, రిషికృష్ణ తదితరులు ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌

టీజీఎంఎస్‌ఐడీసీ జిల్లా ఈఈ రామ్మోహన్‌రెడ్డి

శంషాబాద్‌: నగరంలో స్ట్రీట్‌ రుచులు మిస్సయ్యామనుకునే పర్యాటకులకు.. సిటీని వీడి బయటికి వెళుతున్న స్థానికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ సదుపాయం కల్పించారు. జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టు డిపార్చర్‌ టెర్మినల్‌ సెక్యూరిటీ చెక్‌ తర్వాత ‘హైదరాబాద్‌ స్ట్రీట్‌’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నగర వీధుల్లో దొరికే పానీపురి, కచోరీ, సమోసా, దోశ, పాలక్‌ పన్నీర్‌ పఫ్‌, టిక్కా, కట్లెట్‌ తదితర అన్ని రకాల వీధి ఘుమఘుమలతో కూడిన వంటకాలను విమాన ప్రయాణికులు లొట్టలేసుకుని తినేలా తీర్చిదిద్దినట్లు ఎయిర్‌పోర్ట్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణీకర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement