దివ్యాంగుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

చేవెళ్ల: దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ కేంద్రం వద్ద చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని దివ్యాంగులకు సహాయ పరికరాలు(ట్రై సైకిల్స్‌, బ్యాటరీ సైకిల్స్‌, చేతి స్టాండ్‌, వినికిడి మిషన్‌) అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎస్‌ఆర్‌ నిధుల సహకారంతో వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయని పరస్పర సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కేంద్రం దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దివ్యాంగుల వృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తుల పేర్లు పెట్టుకుని అందిస్తోందన్నారు. ఈ ప్రాంతానికి జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలని.. సాధ్యం కాని ప్రాజెక్టుల పేరిట మోసం చేయొద్దుఅన్నారు. గత ప్రభుత్వం మాదిరగా ఈ ప్రభుత్వం తప్పులు చేయొద్దని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం అందిస్తున్న సెల్‌ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం, చేవెళ్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమతారెడ్డి, శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ రాములుగౌడ్‌, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, మంగమ్మ, మల్లేశ్‌, బి.మాధవిరెడ్డి, సువర్ణ, మధుసూదన్‌రెడ్డి, నర్సింలు, కృష్ణానాయక్‌, ఎం.శ్రీనివాస్‌, మనీషారెడ్డి, మీనాక్షి, నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, వీరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్‌ మల్గారి వైభవ్‌రెడ్డి, అశోక్‌, చందు, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, చేవెళ్ల అర్డీఓ పార్థసింహారెడ్డి, తహసీల్దార్‌ కృష్ణయ్య, ఐసీడీఎస్‌ సీడీపీఓ హెబ్సిబా, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, దివ్యాంగులు, ప్రజలు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

Advertisement
 
Advertisement
Advertisement