యాచారం: భూములు కోల్పోయే రైతులకు మెరుగైన పరిహారం అందజేసేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడుతానని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. భూములు కోల్పోతున్న మొండిగౌరెల్లి రైతులు శుక్రవారం నగరంలోని రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సేకరణతో జీవనోపాధి కోల్పోతున్నారని వారికి మెరుగైన పరిహారం అందజేస్తేనే మేలుజరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలన్ రమాదేవి, ఉప సర్పంచ్ బడే కుమార్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.60 లక్షలు ఇప్పించండి
నోటిఫికేషన్ ప్రకటించిన అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.60లక్షల పరిహారం, 121 గజాల ప్లాటు, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మొండిగౌరెల్లి రైతులు కోరారు. శుక్రవారం వారు తొర్రూరులోని ఎమ్మెల్యే కా్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పరిహారం విషయంలో నాన్చుడి ధోరణితో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓ అనంత్‌రెడ్డిని పిలిచి ఏ మేరకు పరిహారం అందజేసే అవకాశం ఉంటుందో రెండు రోజుల్లో తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలన్ రమాదేవి, ఉప సర్పంచ్ బడే కుమార్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి హామీ


