మొయినాబాద్: ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా చిన్నమంగళారం ఉపసర్పంచ్ అవిశిపేట ఆంజనేయులుగౌడ్ నియమితులయ్యారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌లో శుక్రవారం ఉపసర్పంచ్‌ల ఫోరం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం శ్రీనివాస్‌రెడ్డి, అవిశిపేట ఆంజనేయులు గౌడ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపసర్పంచ్‌లందరికీ అండగా ఉంటానని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, రమేష్, మహిపాల్, వెంకట్‌రెడ్డి, బిక్షపతిగౌడ్, వెంకటేష్‌గౌడ్, శివశంకర్, సురేష్, ప్రసాద్, కిరణ్, అనిల్, పవన్ పాల్గొన్నారు.


