ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్‌పీజీ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ నేచురల్ గ్యాస్‌ను వ్యవస్థీకరించడానికి అన్ని శాఖలు సహకరించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ అధ్యక్షతన పైప్‌లైన్ నేచురల్ గ్యాస్‌ను వ్యవస్థీకరించడంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వంటగ్యాస్ వినియోగంలో ఎల్‌పీజీ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించే పైప్‌లైన్ గ్యాస్ వినియోగానికి రోడ్, నేషనల్ హైవే ఇతర ప్రాంతాల్లో నిర్మాణ పరంగా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. పైప్‌లైన్ గ్యాస్ వినియోగానికి ప్రజలు ఆసక్తి చూపేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, నిర్మాణ పరంగా వచ్చే ఆటంకాలను పరిష్కరించే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. త్వరలో జిల్లాలో పైప్‌లైన్ గ్యాస్ వినియోగం అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, సివిల్ సప్లై అధికారి వనజాత, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


