కష్టపడిన కార్యకర్తలకే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కష్టపడిన కార్యకర్తలకే గుర్తింపు

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

కష్టపడిన కార్యకర్తలకే గుర్తింపు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని, పటిష్టత కోసం పని చేస్తున్న నిజమైన కార్యకర్తలకే గుర్తింపు లభిస్తుందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం గాంధీభవన్‌లో 26 మంది సభ్యులతో కూడిన జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, పార్టీ ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్‌, తదితర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్ల శాతంపై చర్చించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ.. ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని, కష్ట కాలంలోనూ పార్టీతోనే ఉన్న, సంస్థాగతంగా పటిష్టత కోసం పాటుపడిన నిజమైన కార్యకర్తలకు పార్టీలోనే కాకుండా ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు కాకుండా మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న క్రమశిక్షణ కలిగిన సీనియర్‌ నేతలకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement