అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

కేంద్రం నిధులతోనే అభివృద్ధి

యాచారం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని కోలన్‌గూడ గ్రామానికి చెందిన ఆదర్ల రాజు(33) మంగళవారం రాత్రి చింతుల్ల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు రాజును ఎవరో తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు ఆరోపించారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియాకు తరలించారు.

దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు

మోమిన్‌పేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు. బుధవారం మండలంలోని రాళ్లగుడుపల్లి గ్రామంలో ఎంపీ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్‌ వర్త్య మహిపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ, డ్వాక్రా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా నాటి నుంచి నేటి వరకు ఉచితంగా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అశిరెడ్డి, నాయకులు అరుణ్‌కుమార్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మందుగుండు పేలి

ఆవుకు తీవ్రగాయాలు

ఇబ్రహీంపట్నం: అడవి పందుల షికారుకు పెట్టిన మందుగుండు సామగ్రి పేలి మేతకెళ్లిన ఆవుకు తీవ్రగాయాలైన సంఘటన శేరిగూడలో చోటుచేసుకుంది. శ్రీనివాస్‌రెడ్డి అనే రైతుకు నాలుగు ఆవులున్నాయి. సమీప అటవీ ప్రదేశంలో మేత కెళ్లిన ఆవుల్లో ఒకటి మందుగుండు సామగ్రిని నోటపట్టుకోవడంతో పేలి నోటికి మెడకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సుమారు రూ.60 వేల విలువచేసే ఆవు ప్రాణాపాయస్థితిలో ఉండటంలో మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్‌ చారిటబుల్‌ సొసైటీకి ఆ రైతు అప్పగించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌, ఫారెస్టు ఽఅధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement