క్రీడాపోటీలతో ప్రతిభ వెలుగులోకి | - | Sakshi
Sakshi News home page

క్రీడాపోటీలతో ప్రతిభ వెలుగులోకి

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

తుర్కయంజాల్‌: యువత క్రీడలపై ఆసక్తి చూపడం అభినందనీయమని.. క్రీడాపోటీలతో యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. ఆదిబట్ల సర్కిల్‌ పరిధి మన్నెగూడలోని శివాజీ గ్రౌండ్స్‌లో టీం ఏఎన్‌ఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖేలో ఇండియా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడలను నిర్వహిస్తున్న తుర్కయంజాల్‌ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బచ్చిగళ్ల రమేశ్‌, నారాయణ యాదవ్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement