ఆమనగల్లు: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆహార భద్రత, ప్రజలకు నాణ్యమైన ఆహార సరఫరా, ప్రజాపంపిణీ వ్యవస్థ వంటి అంశాలను గవర్నర్‌కు వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు సరైన సమయంలో ధాన్యం, ఇతర వస్తువులు అందేలా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రేషన్ దుకాణాల నిర్వహణలో పారదర్శకత, అవినీతి నివారణ, డిజిటల్ సాంకేతిక వినియోగం ద్వారా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్న విషయాలను చెప్పారు. అనంతరం రాష్ట్రంలో ఆహార భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని గవర్నర్ సూచించినట్లు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఆనంద్, భారతి తదితరులు ఉన్నారు.
గవర్నర్‌ను కలిసిన ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు


