బీఆర్‌ఎస్‌లో చేరిన టీఎస్‌ఎస్‌ఓ నేత | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో చేరిన టీఎస్‌ఎస్‌ఓ నేత

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

ఆమనగల్లు: టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మీసాల వర్షిత్‌ ఆ సంస్థకు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీమంత్రి హరీశ్‌రావు, ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ల సమక్షంలో వర్షిత్‌ బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు జీఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వర్షిత్‌ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాడుతామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement