అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
జిల్లా రెవెన్యూ అధికారి సంగీత
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులు అందాయి. వీటిని ఆమె నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సూ పరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మొయినాబాద్: ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఎం3 (మ్యారేజ్ మీనింగ్ మారింది) చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఎం3 సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ నగర శివారులోని మొయినాబాద్‌లో ఉన్న ఓ ఫాంహౌస్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు శిశ్యుడు రామ్‌కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సెట్‌కు విచ్చేసి చిత్ర నిర్మాత లక్ష్మి, డైరెక్టర్ రామ్‌కిషన్‌తోపాటు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎంటర్‌టైన్‌గా ఉండబోతోందని అన్నారు. కుటుంబ సమేతంగా చూసే విధంగా.. ఆడియన్స్ అంచనాలు, అభిరుచులకు దగ్గరగా ఉంటుందన్నారు. ఈ సినిమాలో మురళీ శర్మ, రాజకుమార్, కసిరెడ్డి, రవికృష్ణ, భరణి, మౌనిక, కుష్బు ఆరాధ్య, ఆది ఇతర తారాగణం ఉన్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు.


