మామిడి రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌: పండ్ల మార్కెట్‌లోకి వచ్చే మామిడి రైతులను అధిక కమీషన్ల పేరుతో ఇబ్బందులకు గురిచేసే ఏజెంట్లతో పాటు పక్వానికి నిషేధిత రసాయనాలు వాడే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్టు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. మామిడి సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్‌లో జరుగుతున్న క్రయవిక్రయాలను సోమవారం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్‌ యార్డు మొత్తం కలియతిరిగి రైతుల సమస్యలు, క్రయవిక్రయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ వారి ప్రయోజనాల కోసమే మార్కెట్‌ కమిటీ పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌ భాస్కరాచారి, మార్కెట్‌ సెక్రటరీ ఎల్‌.శ్రీనివాస్‌, డైరెక్టర్లు బండి మధుసూదన్‌ రావు, అంజయ్య, రఘుపతి రెడ్డి, నరసింహ, మచ్చేందర్‌ రెడ్డి, గణేశ్‌ నాయక్‌, వెంకటేశం గుప్తా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement