మంచాల: రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల పాఠశాల అని రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడి స్కూల్‌ను తీసుకోవడం జరిగిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలను సందర్శిస్తారని చెప్పారు. పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ెపేరెంట్స్ కమిటీ సభ్యులు శ్రీశైలం, మల్లేష్, యాదగిరి, వార్డు సభ్యుడు శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనుల పరిశీలన


