చేవెళ్ల: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యాచరణ పనులు పక్కాగా జరగాలని మున్సిపల్ ప్రజాపాలన ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి అన్నారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం ఆమె మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఉన్న యాక్షన్ ప్లాన్, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్నిశాఖల అధికారుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు అధికారులు పాల్గొన్నారు.


