వైభవంగా ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఉత్సవాలు ప్రారంభం

Mar 30 2026 12:01 PM | Updated on Mar 30 2026 12:01 PM

కడ్తాల్‌: మండల కేంద్రంలోని శ్రీ సీతారామాలయంలో విజయ గణపతి, జ్ఞాన సరస్వతి, సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు ఆదివారం శ్రీశైలం చంద్రశేఖర శివాచార్య మహాస్వామి శిష్య బృందంతో పాటు, అంగడి మఠం భువనేశ్వర్‌స్వామి, శివశ్రీ జ్ఞానేశ్వర శాస్త్రి, శ్రీమాన్‌ శ్రీరంగం అరేష చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ఆలయ ప్రవేశం, మహాగణపతి విశ్వక్సేన ఆరాధన, గౌరిపూజ, పుణ్యాహవాచనం, శివుడి రుద్రాభిషేకం, అఖండ దీపారాధన మహా మంగళహారతి, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు బస్వారాజ్‌ రాజమణి దంపతులు, అర్చకులు రామశర్మ, నాయకులు సంతోష్‌, మల్లేశ్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement