● మహిళలు వందశాతం
అక్షరాస్యత సాధించాలి
● అక్షరమాల కార్యక్రమంలో వక్తలు
ఆమనగల్లు: మహిళలు వందశాతం అక్షరాస్యత సాధించాలని, అప్పుడే వారి ఇంటితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని వక్తలు అన్నారు. అక్షరాస్యత పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘ఉల్లాస్– అమ్మకు అక్షరమాల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం గ్రామీణ ప్రాంతాల నిరక్షరాస్యుల్లో అక్షర వెలుగులు నింపడానికి అక్షరాస్యత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు తలకొండపల్లి మండలం లింగరావ్‌పల్లి, చీపునుంతల గ్రామాల్లో నవభారత సాక్షరత పరీక్షలు నిర్వహించారు. లింగరావ్‌పల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, చీపునుంతల సర్పంచ్ లక్ష్మమ్మ, నాయకులు వెంకట్‌రెడ్డి, జంగయ్య, భాగ్య, శ్రీజ, సాత్విక, రబ్బాని, రాజు, లావణ్య, అశ్వని, నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిరక్షరాస్యత నిర్మూలనకు..
మంచాల: ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని సర్పంచ్ ఏర్పుల మానస వినయ్ అన్నారు. ఆదివారం గ్రామంలో ఉల్లాస్– నవ భారత్ సాక్షరత కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అక్షరమాల నేర్చుకున్న పొదుపు సంఘం సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. వయోజన విద్య కేంద్రాలు, రాత్రి బడులు చేపడుతోందని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా సీ్త్ర, పురుషులు చదువు నేర్చుకోవాలని సూచించారు. ఎంఈఓ రాందాస్, ఏపీఎం శేఖర్, సీసీలు కృష్ణ, చంద్రిక, వీఓఏలు పాల్గొన్నారు.


