హష్‌ ఆయిల్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

హష్‌ ఆయిల్‌ పట్టివేత

Mar 30 2026 12:01 PM | Updated on Mar 30 2026 12:01 PM

మహేశ్వరం: హష్‌ ఆయిల్‌ తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 9.402 కిలోల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారి మహేశ్వరం గేటు వద్ద చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జీడిమడుగుల మండలం సంకులమిద్దె గ్రామానికి చెందిన కొరాబు చంటి హష్‌ ఆయిల్‌ను బ్యాగులో పెట్టుకొని హైదరాబాద్‌కు తరలిస్తూ ఆదివారం రాత్రి మహేశ్వరం గేటు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్‌ఓటీ పోలీసులు విచారించి బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో సుమారు 9.402 కిలోల ఆయిల్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ, మహేశ్వరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి నిర్మాణానికి చేయూత

ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధి విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్‌ పంతునాయక్‌ ఇంటి నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ నాయకుడు జగదీశ్‌ చేయూతనందించారు. నిర్మాణానికి కావాల్సిన సిమెంట్‌ బస్తాలను అందజేశారు. మాజీ సర్పంచ్‌ సాలయ్య, నాయకులు శంకర్‌నాయక్‌, వెంకట్‌రెడ్డి, చంద్రునాయక్‌, జంగాచారి, మల్లయ్య, కిశోర్‌, మల్లేశ్‌, వీరేశం, శ్రీను, గోపి, అనిల్‌ ఉన్నారు.

ఆ ఆలయాలను సంరక్షించండి

ఇబ్రహీంపట్నం రూరల్‌: జేబీ వెంచర్‌లోని పురాతన దేవాలయాలను కాపాడాలని హిందు వాహిని నాయకులు కోరారు. ఆదివారం వెంచర్‌లోని సోమనగుట్ట దేవస్థానాన్ని సందర్శించి మాట్లాడారు. ఆలయంతో పాటు గుట్టను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. చౌడమ్మ తల్లి, మల్లికార్జున స్వామి విగ్రహాలను తొలగించాలని చూస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పట్నం ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించి ఆలయాన్ని సంరక్షించడంతో పాటు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తాగు నీటి సమస్యను అధిగమిస్తాం

మంచాల: గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆరుట్ల సర్పంచ్‌ మానుపాటి శోభ కుమార్‌ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించారు. 40 బోరు బావులను గుర్తించారు. నీటి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజల సహకారంతో నీటి వనరులు ఉన్న చోట బోరు బావులకు మోటార్లు బిగిస్తున్నామని తెలిపారు. నీటిని పొందుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నూకం రాజు ముదిరాజ్‌, వార్డు సభ్యులు పున్నం రాము, బాలమణి, పద్మ, జంగయ్య, మౌనిక, మమత, నాయకులు జానీ పాష, చిందం రఘుపతి, జంగయ్య, పాండు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement